బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అదిరిపోయేలా ప్లాన్..

70
Bigg Boss 4

డిసెంబర్ 20 న బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే జరగనుంది. ఈ ఫినాలే ఎపిసోడ్‌ను అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు స్టార్‌ మా నిర్వాహకులు.ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ వేగంగా జరుగుతున్నాయి. గ్రాండ్ ఫినాలెకి మూడు రోజులు ముందు నుంచి అసలు రచ్చ మొదలుకానుంది. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అంటే డిసెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ వారం మొదట్లోనే పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను ఇంట్లోకి పంపించి వాళ్లతో మాట్లాడించారు. ఇక గత సీజన్‌లో చేసినట్లే ఈ సారి కూడా ఇఫ్పుడు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరిని రీ యూనియన్ కోసం పిలవనున్నట్లు తెలుస్తుంది. అందదిని మళ్లీ కలిపించి పార్టీలా చేయబోతున్నారని.. దాని వల్ల రేటింగ్ కూడా భారీగా వస్తుందని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.

అయితే వాళ్లు అనుకున్నది ఎంతవరకు సాధ్యమవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బయట కరోనా నడుస్తుంది. ఇలాంటి సమయంలో అందర్నీ ఇంట్లోకి పంపడం అంటే చిన్న విషయం కాదు. అందరికీ టెస్టులు చేసి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తే కానీ పంపలేని పరిస్థితి. అందుకే ఇది అయ్యేవరకు కూడా అనుమానమే. కానీ ఫినాలే ఎపిసోడ్ మాత్రం కచ్చితంగా అందరూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. వాళ్లతో స్కిట్స్‌తో పాటు డాన్సులు కూడా చేయించబోతున్నారు. గత సీజన్స్‌లో కూడా ఇలాగే చేసారు. ఇప్పుడు ఇదే రిపీట్ చేయబోతున్నారు. అంతేకాదు ఫినాలే ఎపిసోడ్ కోసం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లలో ఒకరు వస్తారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా చివరి మూడు రోజులు మాత్రం మామూలు రచ్చ ఉండకూడదని ప్లాన్ చేస్తున్నారు. అది వర్కవుట్ అయితే టీఆర్పీ రేటింగ్ కూడా రికార్డ్స్ క్రియేట్ ఖాయం.