బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 103 హైలైట్స్

45
episode 103

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 103 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 103వ ఎపిసోడ్‌లో భాగంగా హారిక,అరియానా,సొహైల్ జర్నీని చూపిస్తూ ఎమోషన్‌కు గురిచేశారు బిగ్ బాస్.

తొలుత హారిక గురించి మాట్లాడిన బిగ్ బాస్… మిమ్మల్ని ఎన్ని మేఘాలు కప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. సూర్యకాంతిలా ఛేదించుకుంటూ ఫైనల్‌కి చేరుకున్నారు అంటూ స్పెషల్ వీడియోని చూపించారు. అనంతరం మాటలు రావడం లేదు బిగ్ బాస్.. ఈ 14 వారాలు ఎలా గడిచాయో నాకు అర్థం కావడం లేదని తెలిపింది. ప్రతిరోజు నేర్చుకున్నా.. నా లైఫ్‌కి చాలా ఉపయోగపడతాయని తెలిపింది.

తర్వాత సొహైల్ జర్నీని అద్బుతంగా చూపించారు బిగ్ బాస్. సొహైల్ మీరు ఈ ఇంట్లో ఇబ్బంది పెట్టే పక్కింటి వారిగా ప్రయాణం మొదలుపెట్టి.. కానీ మీ ప్రయాణం ముగిసే సమయానికి ప్రతి ఇంట్లో మీకోసం చూసే వారిగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందారని తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ సొహైల్‌లో ఉన్న అన్ని భావోద్వేగాలను చూపించారు…మీ ప్రతి ఎమోషన్ చాలా స్వచ్ఛంగా నిజమైనదిగా ఉంటుందన్నారు.

తన వీడియో చూసిన అనంతరం సొహైల్ భావోద్వేగానికి గురౌతూ ఏడ్చేశాడు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.. పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా..ఇంకెప్పుడురా నువ్ సెట్ అయ్యేది అంతా ఎగతాలి చేసేవారు… ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూస్తున్నారని అన్నారు. నాకు సినిమానే జీవితం బిగ్ బాస్..జాబ్ చేయలేను.. బిజినెస్ చేసే తెలివిలేదు.. ఒక మంచి మార్గం చూపించారని అన్నారు. చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్‌ని ఆస్వాదిస్తూ.. జై సింగరేణి..సింగరేణి ముద్దుబిడ్డా.. ఇస్మార్ట్ సొహైల్.. ఇక కథ వేరే ఉంటుంది అంటూ బిగ్ బాస్‌కి థ్యాంక్స్ చెప్పాడు సొహైల్.

ఇక చివరగా అరియానా జర్నీని చూపించారు బిగ్ బాస్. అరియానా మీరు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఒక సంచలనం.. మీరు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈరోజు వరకూ మీ వేగాన్ని తగ్గించలేదన్నారు. మీ ఎనర్జీతో ప్రత్యేకంగా నిలిచారు…. కొన్ని సందర్భాల్లో ఒంటరి అయ్యారు.. అందరి గురి మీపైనే ఉన్నా,మీ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకుసాగారు. అందుకే బిగ్ బాస్ హౌస్‌లో షైనింగ్‌ స్టార్‌గా నిలిచారని కొనియాడారు. నా లైఫ్‌లో మర్చిపోలేని స్థానం ఇచ్చారు.. సమాజంలో నాకు బిగ్ బాస్ అరియానా అనే గుర్తింపు ఇచ్చారని బావోద్వేగానికి గురైంది అరియానా.