అక్కా అక్కా అంటూనే వెన్నుపోటు పోడిచారుః బిగ్ బాస్ ఎలిమినేటర్ హేమ

430
Hema
- Advertisement -

బిగ్ బాస్ 3 హౌజ్ నుంచి నటి హేమ ఎలిమినెట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె హౌజ్ నుంచి బయటకు వచ్చాక స్టార్ మా ఛానల్ పై , కంటెస్టెంట్స్ పై తీవ్ర విమర్శలు చేసింది. శ్రీముఖి లోపల ఒకలా బయటకు ఒకలా ఉంటుందని..ఆమెకు చాడీలు చెప్పడం అలవాటు అని చెప్పింది. అందరిలో తాను మంచిదాన్ని అనిపిచ్చుకునేందుకు వేరే వాళ్లని బ్యాడ్ చేస్తుందన్నారు.

శ్రీముఖి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడి మ్యానప్యులేట్ చేస్తుంది. చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నా అనుకుంటుంది. తనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే, వాళ్లను బయటకు బయటకు పంపించాలనే మనస్తత్వమని హేమ ఆరోపించింది. హౌస్ సభ్యులు అందరూ తనను అక్కా అక్కా అంటూనే వెన్నుపోటు పోడిచారని తెలిపింది.

అసలు నేను అక్కడ గేమ్ ఆడలేదని చెప్పారు. వరుణ్ సందేశ్ మహేశ్ కు జరిగిన గొడవలో లోపల జరిగింది వేరు బయటకు చూపించింది వేరు అని చెప్పారు. అనవసరంగా వరుణ్ సందేశ్ మహేశ్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టాడని ఆరోపించింది. కానీ కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచి వారని తెలిపింది. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత ఒక్కరోజు వాళ్లు నన్ను కిడ్నాప్ చేసేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రసారం అయిన తరువాతే నన్ను బయటకు పంపారని తెలిపింది.

- Advertisement -