రేవ్ పార్టీలో హేమ.. డ్రగ్స్ టెస్ట్‌లో నిర్దారణ!

8
- Advertisement -

బెంగళూరు రేవ్ పార్టీకి తనకు సంబంధం లేదని బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. ఆ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుద‌ల చేయగా దీని ఆధారంగానే రేవ్ పార్టీలో ఉంది హేమ అనే విషయాన్ని స్పష్టం చేశారు పోలీసులు. విచార‌ణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వ‌హించ‌గా.. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమ‌తో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్ర‌క‌టించారు.

పోలీసులు తనకు పంపిన నోటీసులపై స్పందించారు హేమ‌. ఏం చేస్తారో చేసుకోండి.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు నేను కూడా మాట్లాడ‌తా అంటూ మీడియాతో చెప్పుకోచ్చింది. ఈ పార్టీకి వ‌చ్చిన హేమ త‌న అస‌లు పేరును కృష్ణ‌వేణిగా న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో ఆమె వీడియో వైర‌ల్ అయ్యాకే హేమ‌గా గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు.

Also Read:పౌష్టికాహార లోపమా..అయితే జాగ్రత్త!

- Advertisement -