షాకింగ్…ప్రకాశ్‌ రాజ్ ప్యానల్‌లో హేమ,జీవిత

138
maa
- Advertisement -

గత కొద్దిరోజులగా మా ఎన్నికలపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బరిలో ఉంటామని ప్రకాశ్‌ రాజ్,మంచు విష్ణు,జీవిత రాజశేఖర్,హేమ తదితరులు ప్రకటించగా ఈ సారి ఎన్నికలు కూడా అందరి అటెన్షన్‌ను తమ వైపుకు తిప్పుకున్నాయి. ఇక మా ఎన్నికలపై సుదీర్ఘ చర్చల అనంతరం అక్టోబర్ 10న మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలు జరుగుతాయని క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్‌ని ప్రకటించారు. ఇందులో ఎవరూ ఉహించని విధంగా ఇప్పటివరకు తాము అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించిన హేమ, జీవిత రాజశేఖర్ ఉన్నారు. వీరిని ఒప్పించి తమ ప్యానల్ తరపున బరిలో ఉంచడంలో సక్సెస్ సాధించారు ప్రకాశ్‌ రాజ్. అయితే ప్రకాశ్‌ రాజ్‌కు చిరు వర్గం మద్దతిస్తుండగా ఈ ప్యానల్ నుండే జీవిత రాజశేఖర్ పోటీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రకాశ్‌ రాజ్ ప్యానల్ తరపున ఉపాధ్యక్షురాలిగా హేమ, జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో హేమ ఇండింపెండెంట్‌గా విజయం సాధించగా జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా గెలిచారు.

- Advertisement -