అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మరో తెలుగు క్రికెటర్

470
y venu gopal rao,
- Advertisement -

మరో తెలుగు క్రికెటర్ అంతర్జాతియ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఏపీకి చెందిన క్రికెటర్ వై వేణుగోపాల్ రావు అంతర్జాతీయ క్రికెట్ కు స్వస్తి పలికాడు. 37 ఏళ్ల వేణుగోపాల్ రావు 2005 లో టీమిండియాకు జట్టుకు ఎంపికయ్యాడు.. తన క్రికెట్ కెరియర్ లో భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. ఇక ఐపీఎల్ లో 2008–2010 మధ్యకాలములో డెక్కన్ చార్జర్స్ తరపున, 2011-2013 మధ్యకాలములో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు.

కొద్ది రోజలుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న వేణుగోపాల్ కేవలం ఐపీఎల్ మ్యాచ్ లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇండియన్ టీంలో వేణుగోపాల్ ఆడే అవకాశాలు లేకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వేణుగోపాల్ రావు జనసేనలో చేరాడు. కానీ ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

y venu gopal rao pawan kalyan

సెలక్షన్ కమిటీ ఛైర్మన్ msk ప్రసాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తరుపున ఇండియా టీంకు ప్రాతినిధ్యం వహించిన రెండవ క్రికెటర్ వేణుగోపాల్ రావు. కాగా కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ కు చెందిన అంబటి రాయుడు కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వేణుగోపాల్ రావు ఇక నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటాడని తెలుస్తుంది.

- Advertisement -