వ్యాక్సిన్‌తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు: బైడెన్

90
biden

అమెరికాలో కరోనాకు చెక్ పెట్టేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా ఎఫ్‌డీఐ అనుమతివ్వడం, ప్రజలకు అందుబాటులోకి రాగా తాజాగా మోడెర్నా టీకా సోమవారం నుండి అందుబాటులోకి రానుంది.

సోమవారం(డిసెంబర్ 21న) అమెరికా 46 వ అధ్యక్షుడిగా ఎంపికైన బైడెన్ దంపతులు టీకాను తీసుకోనున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన బైడెన్‌… కరోనా వ్యాక్సిన్ వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తవసంని స్పష్టం చేసేందుకే తాను టీకా తీసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.