చిరుతో సినిమాకు నో చెప్పా: విజయశాంతి

58
vijayashanthi

టాలీవుడ్ హిట్ పెయిర్‌లలో టాప్ జంట మెగాస్టార్ చిరంజీవి -విజయశాంతి. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ముఖ్యంగా వీరిద్దరూ జోడిగా సినిమా వస్తుందంటే అది హిట్ అనేంతలా ప్రేక్షకులు ఆదరించారు.

ఇక తర్వాత కొన్ని మనస్పర్దల కారణంగా వీరిద్దరు సినిమాలు చేయలేకపోయారు. తర్వాత ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం ముఖ్యంగా విజయశాంతి…చిరంజీవిపై విమర్శలు గుప్పించడంతో గ్యాప్ మరింతగా పెరిగింది.ఖైదీ నెంబర్ 150తో చిరు,సరిలేరు నీకెవ్వరుతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరు -విజయశాంతి మళ్లీ సినిమాలు చేస్తారని వార్తలు వెలువడుతుండగా వాటికి పుల్ స్టాప్ పెట్టారు ఈ లేడి అమితాబ్.

సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా మంది ఆఫర్లతో తనను సంప్రదించారని, కానీ వారికి నో చెప్పానని, చివరికి చిరంజీవి సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని కూడా తన వద్దకు వచ్చారని కానీ తనకు ఆసక్తి లేకపోవడంతో వారిని వెనక్కు పంపానని వెల్లడించారు.