ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి :జోబైడెన్‌

175
- Advertisement -

ప్రపంచంలో అత్యధిక ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్‌ ఒకటి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. గత శనివారం లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన డెమొక్రాటిక్‌ కాంగ్రెస్‌ ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశమని జో బైడెన్‌ అన్నారు. అమెరికాకు మధ్యంతర ఎన్నికలు జరగనున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకోంది.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న స్తంభనను కూడా ప్రస్తావించారు. రష్యా విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ..పాకిస్థాన్‌పై వ్యాఖ్యలు చేశారు. కానీ అమెరికాతో సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్టగా ఉంటాయా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే ప్రసంగంలో 21వ శతాబ్ధం రెండవ త్రైమాసికంలో అమెరికాను డైనమిక్‌గా మార్చడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని బైడెన్‌ చెప్పుకొచ్చారు.

యూఎస్‌ జాతీయ భద్రతా వ్యూహం విడుదల చేసిన 48పేజీల పత్రంలో పాకిస్థాన్కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాంగ్రెస్‌ పరిపాలన కమిటి తప్పనిసరి చేసిన కీలక విధాన పత్రాన్ని విడుదల చేసింది. ఇందులో రష్యా చైనా దేశాల నుంచి అమెరికాకు ఎదురయ్యే ముప్పును గూర్చి వివరించారు. జాతీయ భద్రతా వ్యూహం ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో నో-లిమిట్స్‌ పార్టనర్‌షిప్‌ ద్వారా చైనా రష్యా దేశాలు ఒకదానికొకటి ఎక్కువగా కలిసిపోతున్నాయని జాతీయ భద్రతా వ్యూహంలో పేర్కొన్నారు.

గతంలోనే పాకిస్తాన్‌కు ఎఫ్‌-16పైటర్‌ జెట్లను ఇచ్చిన యూఎస్‌ తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ బౌగోళిక రాజకీయాలు ఏవిధంగా ఉంటాయో అని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -