కరోనా నియంత్రణకు సుప్రీం కీలక నిర్ణయం..

416
Supreme Court
- Advertisement -

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారించాలని..అవి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు స్వీకరిస్తుందని తెలిపింది. ఇందుకు ఇద్దరు జడ్జులతో కూడిన ఒక్క బెంచ్ మాత్రమే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వాదనలు వినాలని తీర్మాణించింది. రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వ్యక్తిగతంగా విచారణలను నిర్వహించవద్దని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

న్యాయవాదులు వారి స్వంత కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావచ్చు. రేపు సాయంత్రం 5 గంటలకు సుప్రీంకోర్టులో న్యాయవాదుల గదుల మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే, జస్టిస్​ డీ.వై చంద్రచూడ్​లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్​ పాటించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 31వ వరకు ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.

- Advertisement -