ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా..

104
mann
- Advertisement -

ఈ నెల 16న పంజాబ్ సీఎంగా భగవంత్ సింగ్ మాన్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఎంపీ పదవికి ఇవాళ రాజీనామా చేయనున్నారు భగవంత్. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. సంగ్రూర్ జిల్లాలోని ధురి స్థానం నుంచి 58 వేల 206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు మాన్.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపద్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గం ఏర్పాటుపై పార్టీ కేంద్ర నాయకత్వంతో ఆయన చర్చలు జరుపనున్నారు.

తాను రాజ్ భవన్ లో కాకుండా…భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు.

- Advertisement -