బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా బాలీవుడ్‌లో హైయ్యేస్ట్ కలెక్షన్స్ వసూళ్ల చేసిన చిత్రంగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాతో ఆమిర్ మరో ఘనతను అందుకున్నాడు. 62వ ఫిల్మ్ఫేర్ అవార్ట్సలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపికైయ్యాడు. అదే విధంగా ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవిత కథతో తెరకెక్కిన దంగల్..గొప్ప సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మహిళలను ప్రోత్సహించే చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇందులో ఆమిర్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. దంగల్ కోసం ఆమిర్ 100 కేజీలకు వరకు పెరిగి మరల రెజ్లింగ్ క్యారెక్టర్ కోసం తన ఒళ్లును కరిగించుకున్నాడు. ఓ స్టార్ హీరో అయిండి అలా ఇద్దరు కూతుళ్లకు తండ్రిగా నటించడం..ఆమిర్ కు నటనపై ఉన్న మక్కువ ఏంటో అర్ధం అవుతుంది. సినిమా కోసం తను పడ్డ కష్టానికి ఈ అవార్డుతో సత్కరించినట్టైంది.
ఇక ఫిల్మ్‌ఫేర్ అవర్డ్స్ 2017 ఉత్తమ నటి అవార్డ్‌ను ఆలియా భట్ పొందింది. రెండు చిత్రాలు.. ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ నుంచి నామినేషన్ పొందిన ఆలియా.. ఉడ్తా పంజాబ్‌లో పూర్తీగా డీ గ్లామర్ రోల్‌క పోషించిన ఆలియాకు ఈ అవార్డ్ దక్కింది. పంజాబ్‌లోని డ్రగ్స్ కు యువత ఎలా బలైపోతున్నారనే వాస్తవ కథను చెప్పే ప్రయత్నం చేసిన ఈసినిమా కమర్షియల్ గా అంత విజయం సాధించక పోయినా..విమర్శకుల ప్రశంసలు అందుకుంది.