బాహుబలి బద్దలుకొట్టిన మరో రికార్డు..

277
- Advertisement -

తెలుగు సినిమా స్ధాయిని ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బాహుబలి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడే కాదు భారత చలనచిత్ర రంగంలోని రికార్డులను తిరగరాసింది. బాహుబలి ముందు తర్వాత అనేలా చలన చిత్ర రంగాన్ని చెప్పుకునే స్ధాయిలో రికార్డులు సృష్టిస్తోంది. సినిమా విడుదలై రెండు సంవత్సరాలు కావొస్తున్న బాహుబలి సునామీ మాత్రం ఆగట్లేదు. బాహుబలి రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా విడుదలకు ముందు నుంచి విడుదల తరువాత కూడా ఎదో విషయంలో సరికొత్త రికార్డ్ ను అందుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతోంది.

Baahubali Most Watched Telugu Movie On Netflix

ఇక రీసెంట్‌గా మరో రికార్డును ఆ సినిమా అందుకుంది. డిజిటల్ మీడియా ప్రస్తుతం ప్రపంచంలో చాలా వేగవంతంగా దూసుకుపోతోంది. ఆ వర్గానికి చెందిన నెట్ ఫ్లిక్స్ కూడా వరల్డ్ లో చాలా పాపులర్ అవుతోంది. అయితే బాహుబలి 2 సినిమాను కొనుగోలు చేసి భారత్ లో అడుగుపెట్టిన నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 లో బాహుబలి 2 నిలిచింది. అత్యధికులు వీక్షించిన చిత్రాలలో మొదటి దంగల్ నిలవగా ఆ తరువాత డియర్ జిందగీ రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో బాహుబలి 2 నిలిచింది.

అమిర్ దంగల్ సినిమాతో బాహుబలి కలెక్షన్స్ లో పోటీపడిన సంగతి తెలిసిందే. ఇక నెట్ ఫ్లిక్స్ నెక్స్ట్ టాలీవుడ్ బడా సినిమాల డిజిటల్ రైట్స్ ని అందుకోవడానికి చూస్తోంది. ముఖ్యంగా మహేష్ ప్రభాస్ రాజమౌళి మల్టి స్టారర్ సినిమాలను ఈ సంస్థ ఎక్కువగా టార్గెట్ చేస్తోంది.

- Advertisement -