రామ్ చరణ్‌కు హీరోయిన్ దొరికేసింది..

90
Anupama

ధృవ సినిమాతో మళ్లీ హిట్‌ ట్రాక్ లోకి ఎక్కిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్..నెక్ట్స్‌ సినిమాకు సిద్ధం చేస్తున్నాడు. చిరు ఖైదీ నెం. 150 చిత్రంతో నిర్మాతగా మారి మొన్నటి వరకు కాస్త బిజీ అయిన చరణ్‌..ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన తరువాతి సినిమాపై ఫోకస్ పెట్టాడు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు సుకుమార్ మార్చి నుంచి సినిమా చిత్రీకరణ మొదలెట్టే ఆలోచనలో ఉన్నారట. చరణ్ కూడా గెటప్ కు తగ్గట్టుగా మేకోవర్ అయ్యాడు. క్యారెక్టర్ కోసం గడ్డం పెంచాడు. ఇందులో చరణ్ ఓ డిఫరెంట్ గెటప్‌ లో కన్పించబోతున్నాడట.

Anupama

దర్శకుడు దొరికాడు. కథ ఓకే అయింది. ఆ తర్వాత కావాల్సిన మరో కీలక పాత్ర హీరోయిన్‌. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ కూడా దొరికేసింది. అ.ఆ, ప్రేమమ్, శతామానం భవతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనుపమ పరమేశ్వరన్‌ ను కథానాయికగా ఎంపిక చేశారు. ఆ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా అమ్మడు వెల్లడించింది. ఈసినిమాతో అమ్మడుకు పెద్ద అవకాశం రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో ఓ విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కబోతున్న ఆ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ఓ కథానాయికగా అనుపమ ఎంపిక కాగా, మరో కథానాయిక కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది. గ్రామీణ అమ్మాయి పాత్రల్లో అనుపమ బాగా ఒదిగిపోవడంతో..ఈ సినిమాకు కూడా ఈ భామనే సెలెక్ట్ చశారు.