బాలయ్య కెరీర్‌కే శాతకర్ణి బెస్ట్ ఓపెనింగ్స్‌..

73
Satakarni

బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో వసూళ్లలో బాలయ్య కెరీర్‌ లోనే బెస్ట్ ఓపెనింగ్ మూవీగా శాతకర్ణి రికార్డు సృష్టించింది. బాలయ్యకు ఇది 100వ సినిమా కావడంతో..రిలీజ్ కు ముందు నుంచే శాతకర్ణిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా గొప్ప ప్రయోగం లాంటి చారిత్రాత్మక చిత్రం కావడం వల్ల నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఎగబడ్డారు. దీంతో ఫస్ట్ రోజే అదిరిపోయే ఓపెనింగ్స్‌ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు దాదాపు 10.41కోట్లు వసూలు చేసిందని సమాచారం.

Satakarni

బాలయ్య కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఇది రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 37 కోట్లకు అమ్ముడుపోయాయి. తొలి రోజే10 కోట్లు రావడంతో… ఫస్ట్ వీక్ పూర్తయ్యేలోగా కలెక్షన్స్ మొత్తం రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. నైజాం లో 2.3 కోట్లు.. సీడెడ్ లో 2.15 కోట్లు, కృష్ణలో 80 లక్షలు, గుంటూరులో 1.64 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో78 లక్షలు వైజాగ్ లో 88 లక్షలు, నెల్లూరులో 37 లక్షలు. ప్రస్తుతం సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే.. వారం పూర్తయ్యేలోగా పెట్టిన డబ్బులు మొత్తం శాతకర్ణి తిరిగి రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్యకు పోటీ చిరు ఖైదీ మూవీతో పోటీకి దిగినా..కలెక్షన్ల లో మాత్రం శాతకర్ణి తన సత్తా ఏంటో చూపిస్తోంది. ఈ సంక్రాంతికి నందమూరి అభిమానులకు బాలయ్య శాతకర్ణితో మంచి కానుక ఇచ్చాడని చెప్పోచ్చు.