బిజెపి పాలిత రాష్ట్రాలు మూడు భాషల్ని లేదా.. 30 భాషల్ని బోధించాలనుకుంటే.. వాటికి అనుమతించండి కానీ తమిళనాడుని మాత్రం వదిలేయండి తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్‌వేదికగా తెలిపారు. ఉత్తరాదిలో త్రిభాషా విధానం అమలవుతుందా? చెప్పాలన్నారు స్టాలిన్.
దక్షిణ భారతీయులు హిందీ నేర్చుకునేలా దక్షిణ భారత హిందీ ప్రచార సభ (విద్యా సంస్థలు) ఏర్పాటు చేసి ఒక శతాబ్దం గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఉత్తర భారతదేశంలో ఎన్ని ఉత్తర భారత తమిళ ప్రచార సభలు స్థాపించబడ్డాయి? అన్నారు.
నిజానికి ఉత్తర భారతీయులు తమిళం లేదా ఏదైనా దక్షిణ భారతీయ భాషను సంరిక్షించడానికి నేర్చుకోవాలని మేము ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. మరి అలాంటిది.. మామీద త్రిభాషా విధానంతో హిందీ భాషను ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు? హిందీని రుద్దడం ఆపమనే మేము కోరేది అని తెలిపారు.
Also Read:కుంభమేళ..పోలీసులకు బంపర్ ఆఫర్

