బండి సంజయ్ కోసం బావుపేట గ్రామస్తుల ధర్నా

310
bandy sanjay
- Advertisement -

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోసం గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా ఇంకా కానరావడం లేదంటూ ఆందోళన చేపట్టారు.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన పలువురు తమ ఎంపీ బండి సంజయ్ తమ ఊరికి రావడంలేదని, తమ గ్రామాభివృద్ధిని పట్టించుకోవడంలేదంటూ నిరసన తెలుపుతున్నారు.

ఎన్నికలప్పుడు అది చేస్తా.. ఇది చేస్తానంటివి, కరోనా సమయంలో కూడా కానరావడంలేదు, గెలిచినంక ఒక్క ఊరికి కూడా రాకపోతివి, నిన్ను చూసి ఏడాదవుతోంది అంటూ బ్యానర్ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.

- Advertisement -