స్మార్ట్ సిటీ పనులను అడ్డుకుంటున్న బండి సంజయ్‌:సునీల్ రావు

31
sunil rao

కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులను అసత్య ప్రచారాలు చేసి అడ్డుకుంటున్నారని మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన సునీల్ రావు..స్మార్ట్ సిటీ పనులు నత్తనడక నడుస్తున్నాయి అన్న ఎం పీ బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

రాజకీయ భిక్ష పెట్టిన కరీంనగర్ నగరపాలక సంస్థ పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అసత్య ప్రచారాలు చేసి స్మార్ట్ సిటీ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న బండి…కరీంనగర్ లో తొమ్మిది వందల కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తుంటే కనబడటం లేదా అని ప్రశ్నించారు. కరీంనగర్ సుందరీకరణ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తే ఊరుకునే ప్రసక్తి లేదని బండిని హెచ్చరించారు.