మొక్కలు నాటిన సినీ నటి బత్తిని లత గౌడ్..

43
green

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటారు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యాయురాలు, సినీ నటి బత్తిని లత గౌడ్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఎల్లమ్మ గుడి వద్ద గౌడ కులస్థులకు తన వంతుగా ఉచితంగా 100 గిరక తటి మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం తాను కూడా మూడు మొక్కలు నాటారు..

ఈ సందర్భంగా సినీ నటి లత గౌడ్ మాట్లాడుతూ చొప్పదండి లో 100 గిరాక తాటి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది పకృతి లో భాగం అయిన తాటి ఇత చెట్లకు తెలంగాణ సీఎం కెసిఆర్ గారు గౌడ కులస్థులకు తాటి,ఈత చెట్లు నాటిస్తుండటం సంతోషంగా ఉందన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో కూడా అద్భుతంగా ముందుకు సాగుతుంది… ఒక్కరూ నాటి మరొకరికి ఛాలెంజ్ విసరడం జరుగుతుంది కావున ఇందులో బాగంగా ఇవాళ ఎల్లమ్మ గుడి వద్ద మూడు మొక్కలు నాటానని తెలిపారు. అనంతరం అమ్మ వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ..ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నామన్నారు.