మోడెర్నా టీకాతో అస్వస్థతకు గురైన డాక్టర్‌!

89
moderna

కరోనా సెకండ్ వేవ్‌తో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుండగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ 1 కోటి 50 లక్షల మంది వైరస్ బారిన పడగా..2 లక్షల 86 వేల 249 మంది మృతి చెందారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫైజర్,మోడెర్నా టీకాలకు అత్యవసర అనుమతివ్వగా మోడెర్నా టీకా తీసుకున్న అమెరికా డాక్ట‌ర్‌కు తీవ్ర అల‌ర్జీ వ‌చ్చింది. బోస్ట‌న్‌కు చెందిన డాక్ట‌ర్ హుస్సేన్ స‌ద్రాదేకు టీకా తీసుకున్న కొన్ని క్ష‌ణాల్లోనే అల‌ర్జీ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.అంతేగాదు హార్ట్ రేట్ కూడా పెరిగిందని వైద్యులు వెల్లడించారు.

మోడెర్నా టీకా తీసుకున్న వ్య‌క్తికి తీవ్ర అల‌ర్జీ సోక‌డం ఇదే తొలి కేసు. ఇటీవ‌ల ఫైజ‌ర్ టీకా తీసుకుని అల‌ర్జీకి గురైన అయిదుగురి కేసుల‌ను విచారిస్తున్న‌ట్లు ఎఫ్‌డీఏ చెప్పింది.