లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులు ప్రారంభం-బాల్క సుమన్

39
mla balka suman

కాళేశ్వరం,అన్నారం,సుందిళ్ళ ప్రాజెక్టుల నుండి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా చెన్నూర్ నియోజకవర్గానికి ఒక 1.35 లక్షల ఎకరాలకు సాగనీరు అందించేందుకు జైపూర్ మండలం షెట్ పల్లి వద్ద సుందిళ్ళ బ్యారేజ్ సమీపంలో భారీ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సర్వే ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, జడ్పీ చైపర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంధాలయ చైర్మన్ ప్రవీణ్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో కాళేశ్వరం జలాలు చెన్నూర్ నియోజకవర్గానికి త్వరలోనే రానున్నాయి. కాళేశ్వరం,అన్నారం,సుందిళ్ల ప్రాజెక్టుల వద్ద కొత్తగా మూడు లిఫ్టులు నిర్మించి చెన్నూర్ నియోజకవర్గంలోని 362 చెరువులను నింపుతూ 80వేల ఎకరాల పాత ఆయకట్టుకు,55 వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు. సీఎం కేసీర్ నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని బాల్క సుమన్‌ పేర్కొన్నారు.