దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ..

152
haritha haram
- Advertisement -

దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది .రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు జి.సి చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో.20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించింది కేంద్రం.

2019-20 సంవత్సరంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.హరిత తెలంగాణలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెరిగేలా చేయడం వానలు వాపస్ వచ్చేలా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. హరిత తెలంగాణలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను తీసుకొచ్చిన ఎంపీ సంతోష్…రాజకీయ,క్రీడా,సినీ,పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులతో మొక్కలు నాటించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

- Advertisement -