CM KCR:తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం

33
- Advertisement -

భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌లో ప్రారంభించారు సీఎం.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…తెలంగాణ అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని హాస్యాస్పదంగా తీసుకున్నారని కానీ దాని ఫలితాలు అనతికాలంలోనే దేశాన్నే ఆకర్షించాయన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 273 కోట్ల మొక్కలు నాటామన్నారు. దేశంలో 7 శాతం గ్రీనరీ పెరిగిందన్నారు.

తెలంగాణలో పచ్చదనం పెంపులో గ్రామ సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించారన్నారు. దారులన్ని పూలరథాలుగా కనబడుతున్నాయని చెప్పారు. పాలమూరు ఎత్తిపోథల పథకాన్ని అడ్డుకుంది కాంగ్రెస్ నాయకులేనని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోథల 85 శాతం పూర్తయిందని చెప్పారు.

Also Read:కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన వైఎస్ షర్మిల..

రాబోయే మూడు,నాలుగు నెలల్లోనే ఇబ్రహింపట్నం ప్రజలు మార్పు చూడబోతున్నారని చెప్పారు. గోదావరి నీళ్లు గండిపేట,హిమాయత్ సాగర్‌ వరకు లింకు అవుతాయని దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నీరు అందిస్తామని చెప్పారు.వానలు వాపసు పోవాలే..కోతులు వాపసు పోవాలనే పాట రాశానని గుర్తు చేసిన సీఎం…దానికి పచ్చదనమే మార్గమన్నారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచామని గుర్తుచేశారు.తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ అన్నారు. ప్రతీ ఇంటికి నల్లా ద్వారా నీళ్లు అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు.

హరితతెలంగాణను మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పారు. అందరం కలిసి హరిత తెలంగాణను ముందుకు తీసుకుపోదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం పచ్చగా ఉంటేనే కాలం మంచిగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 276 కోట్ల మొక్కలు నాటామన్నారు. 170 అర్బన్ ఫారెస్ట్‌లు రూపు దిద్దుకున్నాయన్నారు. ఈ సంవత్సరం నుండి ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను ఉచితంగా ఇస్తామన్నారు.

Also Read:కాజల్ కి బాలయ్య టీమ్ గిఫ్ట్

మహేశ్వరం నియోజకవర్గంకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నామన్నారు.తుమ్ములూరులో సబ్‌స్టేషన్‌,మెట్రోను మహేశ్వరంకు పొడగించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారని…దాని కోసం ప్రయత్నిస్తామన్నారు.దుమ్ములూరుకు కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 65 గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలకు స్పెషల్ ఫండ్ మంజూర్ చేస్తున్నామని మున్సిపాలిటీలకు చెరీ రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. 20 ఫారెస్ట్ పోలీస్ స్టేషన్లను ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం అన్నారు.

- Advertisement -