మిలాద్-ఉన్-నబి వేడుకల్లో డిప్యూటీ మేయర్..

387

ముస్లిం సోదరులు ఈద్‌ మిలాడ్‌ ఉన్‌ నబీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండగ సందర్భంగా డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఈ రోజు బోరబండ డివిజన్‌లో కులమతాలకతీతంగా సర్వమత ప్రార్థనలు చేసి, శాంతి ర్యాలీని నిర్వహించారు. ఎక్కడ లేని విధంగా హిందు, క్రిస్టియన్ మత పెద్దలు.. ముస్లింలను సత్కరిస్తూ పండ్లు, స్వీట్లు ఇస్తూ ర్యాలీని ప్రారంభించారు.

Baba Fasiuddin

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. కులాలకు అతీతంగా అందరిని సమానంగా చూసి అన్ని పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హిందు, క్రిస్టియన్ సోదరులు ముస్లిం సోదరులతో కలిసి పండుగ జరుపుకోవడం బోరబండ డివిజన్‌లో ఇదే మొదటి సారి అని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు.