Leechi Fruit:లిచీ పండ్లతో..జాగ్రత్త!

43
- Advertisement -

వేసవిలో ప్రకృతి ప్రసాదించే పండ్లలో లిచీ పండ్లు కూడా ఒకటి. స్ట్రాబెరి రూపంలో ఉండే ఈ పండు రుచిలో కాస్త పులుపు, ఒగరు, తీపి సమపాళ్లలో కలిగి ఉంటుంది. చాలామంది ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ అధిక బరువును తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. అధిక బరువు ఉన్నవాళ్ళు లిచీ పండును తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇందులో ఉండే నీటిశాతం కారణంగా వీటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావనా కలుగుతుంది. తద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. ఇక లిచీ పండ్లలో విటమిన్ సి, ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ ఆర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇక లిచీ పండ్లలో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటివి కూడా ఉంటాయి వీటివల్ల గొంతు నొప్పి , జలుబు వంటి సమస్యలు దారి చేరవు. లిచీ పండ్లు జీవక్రియను మెరుగుపరిచి మలబద్దకాన్ని కూడా దూరం చేస్తాయి. రక్త హీనత, పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు లిచీ పండ్లు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి.. లిచీ పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే లిచీ పండ్లలో పోషకాలతో పాటు ప్రమాదకర రసాయనాలు కూడా సహజ సిద్దంగా ఉన్నాయని అద్యయానాలు చెబుతున్నాయి. లిచి పండ్లలో ఎక్యూట్ ఎన్సెఫలైటీస్ సిండ్రోమ్ అనే రసాయనం ఉంటుంది. ఇది మెదడువాపుకు దారి తీసే అవకాశాలు ఉన్నాయట. ఇక అలాగే ఇందులో మరో హానికర రసాయనం హైపోగ్లైసెమిక్ ఎన్సెఫాలోపతి ఉంటుందని దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకర స్థాయిలో పడిపోతుందని అద్యయానాలు చెబుతున్నాయి. అందువల్ల పండినవైనా లేదా పచ్చివైనా లిచీ పండ్లను అధికంగా తినడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి లిచీ పండ్ల పండ్ల విషయంలో వైద్యుల సలహా మేరకే ఈ పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -