గుజరాత్ కిచిడి తయారుచేస్తా:మోడీతో ఆసీస్ ప్రధాని

359
modi
- Advertisement -

రోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని భారత్-ఆసీస్ దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ.ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మెరిసన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

అయితే ఆ స‌మావేశంలో ఫ‌న్నీ సంభాష‌ణ చోటుచేసుకుంది. మోడీ ఆలింగ‌నాలు మిస్ అవుతున్న‌ట్లు జోక్ వేసిన ఆసీస్ ప్రధాని… ఒక‌వేళ మ‌నం క‌లుసుకుంటే, తాను చేసిన స‌మోసాల‌ను కూడా షేర్ చేసేవాడిన‌ని పేర్కొన్నారు.

ఈసారి గుజ‌రాతీ కిచిడీని కూడా త‌న కిచెన్‌లో త‌యారు చేస్తానని… మ‌నం ఇద్ద‌రం ప‌ర్స‌న‌ల్‌గా క‌ల‌వ‌డానికి ముందు కిచెన్‌లో కిచిడీ త‌యారు చేస్తానని స్కాట్ త‌న మాట‌ల‌తో మోడీని న‌వ్వించారు.

ఈ సందర్భంగా కిచిడీ అంటే గుజ‌రాతీ ప్ర‌జ‌లు ప్ర‌సన్నుల‌వుతార‌న్నారు. ఆస్ట్రేలియాలోనూ గుజ‌రాతీలు ఉంటారు, వాళ్లు కూడా మీ మాట‌లు వింటే సంతోషిస్తారన్నారని చెప్పుకొచ్చారు.

- Advertisement -