ఓటమి ఖాయమనుకున్న జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు మ్యాక్స్‌వెల్. డబుల్ సెంచరీతో కనివిని ఎరుగని అద్భుతాన్ని సాధించారు. భారీ లక్ష్యం, 91 పరుగులకే 7 వికెట్లు కొల్పోయింది కానీ మ్యాక్స్ వెలు ఉక్కు సంకల్పం ముందు లక్ష్యం చిన్నబోయింది. సిక్సర్లు, ఫోర్లతో ఆప్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు మ్యాక్స్‌వెల్. దీంతో 292 పరుగుల లక్ష్యాన్ని 46.5 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 293 పరుగులు చేసింది. 128 బంతుల్లో 21ఫోర్లు, 10 సిక్స్‌లతో 201 నాటౌట్ నిలిచి జట్టును గెలిపించాడు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 143 బంతుల్లో 129 నాటౌట్‌తో రాణించాడు. అజేయ డబుల్ సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. మ్యాక్స్‌వెల్, కమిన్స్ కలిసి 202 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డే ప్రపంచకప్‌లో గప్టిల్(237*), గేల్(215) తర్వాత ఎక్కువ స్కోరు చేసిన మూడో బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్ (201*) నిలిచాడు.
Also Read:ఢిల్లీ దొరలు వర్సెస్ తెలంగాణ ప్రజలు!