హడలెత్తించిన మ్యాక్సీ..ఆసీస్ బోణి!

36
- Advertisement -

భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఆసీస్ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదటి రెండు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించగా.. తప్పక గెలవాల్సిన మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 129 పరుగులు చేసి సెంచరీతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ కు బాటలు పడ్డాయి. ఆ తరువాత సూర్య కుమార్ యాదవ్ 39 పరుగులు, తిలక్ వర్మ 31 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. .

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మొదట్లో తడబడుతు వికెట్లు కోల్పోయినప్పటికీ మాక్స్ వెల్ భీకర విద్వాంస బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 222 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి చేధించింది. మ్యాక్స్ వెల్ (104) సెంచరీ సాధించగా, ట్రావిస్ హెడ్ (35), , వేడ్ (28), స్టాయినిస్ (17).. జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ విజయంతో 2-1 గా ఆస్ట్రేలియా సిరీస్ లో నిలబడింది. ఇక రెండు జట్ల మధ్య జరిగే నాలుగో మ్యాచ్ కు మ్యాక్స్ వెల్ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అలాగే టీమిండియాలో కూడా తిలక్ వర్మ కు రేస్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ జట్టులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి మిగిలిన రెండు మ్యాచ్ లలో భారత్ ఏ ఒక్క మ్యాచ్ లో గెలిచిన సిరీస్ సొంతమౌతుంది. మరి ఏ జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Also Read:మ్యాక్స్‌వెల్.. ఊచకోత

- Advertisement -