మోడీజీ..బీఆర్ఎస్ ముమ్మాటికీ తెలంగాణ టీమే

40
- Advertisement -

బీఆర్ఎస్ సర్కార్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

రాహుల్ వచ్చి..
మమ్మల్ని మీ బీ టీమ్ అంటారు
మీరొచ్చి…
మేము కాంగ్రెస్ సీ టీమ్ అంటారు.

మేం బీజేపీకి బీ టీమ్ కాదు
కాంగ్రెస్ కు సీ టీమ్ కాదు..

మాది ముమ్మాటికీ
T టీమ్.. తెలంగాణ టీమ్

తెలంగాణ ప్రజల హక్కుల కోసం..
ఎవరితోనైనా.. ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్

నిన్నటి దాకా మత రాజకీయం చేశారు !!
నేడు కుల రాజకీయానికి తెర తీశారా ??

పదేళ్ల మీ హయాంలో..
దేశంలోని బీసీలకు మిగిలింది వేదన… అరణ్య రోదనే

కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన మీది..
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది..
అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయే

బీసీలంటే మీ దృష్టిలో బలహీనవర్గాలు
కానీ.. మాకు బీసీలంటే.. బలమైన వర్గాలు

రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు..
అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం మాది

టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిందే మీ బీజేపీ నేతలు
నిందితులతో వేదిక పంచుకుని.. మాపై నిందలా ??

దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో
కాంగ్రెస్ నే మించిపోయింది.. మీ బీజేపీ ప్రభుత్వం

ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని మీరు..
రెండుసార్లు సంకల్పించిన మా సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరం..

బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని స్పష్టం చేశారు.

Also Read:టైగ‌ర్‌ 3..సెకండ్ ట్రాక్

- Advertisement -