ఎంపీ అరవింద్‌పై అట్రాసిటీ కేసు..

16
mp aravind

ఎంపీ అరవింద్‌ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మార్ఫింగ్ ఫోటోలు,నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా నిజామాబాద్ జల్లా శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదుతో నిజామాబాద్ ఐదో టౌన్ పోలీసులు అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్‌లో అట్రాసిటీ చట్టాన్ని కించపరిచేలా అరవింద్ వ్యాఖ్యానించారని.. దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయన్ను చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదుచేశారు పోలీసులు.

ఇక పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరవింద్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కూడా కేసు ఫైల్ అయింది.