ఎన్టీఆర్‌-చరణ్‌లపై మాధవన్‌ కామెంట్స్ వైరల్!

22
madhavan

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. సంక్రాంతి రేసు నుండి ఈ సినిమా తప్పుకున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చరణ్‌- ఎన్టీఆర్‌ చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి స్నేహాం చూసి ఫ్యాన్స్‌ ఆనందంతో మురిసిపోతుండగా తాజాగా హీరో మాధవన్ సైతం అంతే ఫిదా అయిపోయారు.

‘నాటు నాటు..’ పాటలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను చూసి తనకు అసూయ కలిగిందంటూ ప్రముఖ నటుడు మాధవన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. నాటు నాటు పాటని షేర్ చేస్తూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. ఇందులో వారిద్దరి స్నేహం, సమన్వయం నాలో అసూయ పుట్టిస్తున్నాయని పేర్కొన్నారు.