కేజ్రీవాల్‌ కోసం పనిచేయనున్న ప్రశాంత్ కిశోర్..

411

ప్రశాంత్ కిషోర్ రాజకీల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. పొలిటికల్ ఎనలిస్టుగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ కిశోర్ …ప్రధానమంత్రిగా మోడీ ఎంపికవడం దగ్గరి నుంచి ఇటీవల ఏపీలో జగన్ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్‌ సీఎం ,తమిళనాడులో కమల్ తరపున పనిచేస్తున్నారు.

తాజాగా ఢిల్లీలో ఆప్ చీఫ్,సీఎం కేజ్రీవాల్ తరపున పనిచేయనున్నారు. మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ ప్యాక్‌తో కేజ్రీవాలు చేతులు కలిపారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కేజ్రీ. ఇండియన్ ప్యాక్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలపగా కేజ్రీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ మేం ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో అత్యంత కఠినమైన ప్రత్యర్థి మీరు అంటూ పేర్కొంది ఐ ప్యాక్‌.

ప్రస్తుతం ప్రశాంత్…జేడీయు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. దీంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని వార్తలు వచ్చాయి.

indian pac