ప్రతి ఎకరా సాగులోకి తెస్తాం: మంత్రి పువ్వాడ

313
puvvada ajay

కృష్ణ , గోదావరి జలాలు పూర్తి స్థాయిలో ఉపయోగించికుని , ప్రతి ఎకరా సాగులోకి తెస్తామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కొర్లగూడెంలో మాట్లాడిన ఆయన గతంలో రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేదని కానీ ఈ ఏడాది 55 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు.

కాళేశ్వరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 70 నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. సీతారామ కూడా పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టును స్థిరీకరణ చేస్తాం అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎక్కడ సమస్యలు రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని…ప్రతీ గింజా కొంటాం అన్నారు. ఖరీఫ్ లో కూడా వరి సాగు చేసుకోండి..నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం , ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు పువ్వాడ అజయ్.

Puvvada Ajay Kumar is an Indian Politician from Telangana State. He is the Transport Minister of Telangana from 2019. He is also the chairman of Mamata Academy