అర్ధం ఫస్ట్ లుక్‌..

176
ardam

మ‌హేంద్ర‌న్ హీరోగా శ్ర‌ద్దాదాస్ , అజ‌య్‌, ఆమ‌ని, సాహితీ ఆవంచ‌, నంద‌న్ ఇతర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం అర్ధం. సినిమా ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్ చేశారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమ‌న్.ఈ సందర్భంగా అర్ధం చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు తమ‌న్‌. ఎడిట‌ర్, వీఎఫ్ఎక్స్ టెక్నీషియ‌న్ మ‌ణికాంత్ త‌ల‌గుటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

మిన‌ర్వా మూవీ మేక‌ర్స్, శ్రీ వాసవి మూవీ బ్యాన‌ర్ల‌పై రాధికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కాబోతుంది. మ‌హేంద్ర‌న్ మూడేళ్ల వ‌య‌స్సులోనే యాక్టింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. చైల్డ్ యాక్ట‌ర్ గా ఆరు భాష‌ల్లో 100 సినిమాల‌కుపైగా న‌టించిన రికార్డు మ‌హేంద్ర‌న్ పై ఉంది.

సినిమా కోసం ప్ర‌తీ ఒక్క‌రూ ఉత్త‌మంగా ప‌నిచేశారని నిర్మాత రాధికాశ్రీనివాస్ అన్నారు. ఈ సినిమాలో సైకలాజికల్ థ్రిల్లర్ జోన‌ర్‌తో వినోదాన్ని జోడించిన‌ట్టు డైరెక్ట‌ర్ మ‌ణికాంత్ తెలిపారు.