మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు…

111
gas

గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.25 పెరగగా ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 859.5 అయ్యింది.ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ.859.5 కాగా, ఇప్పటి వరకు రూ .834.50గా ఉంది. కోల్‌కతాలో, LPG సిలిండర్ ధర రూ .861 నుండి రూ. 886 కి పెరిగింది. హైదరాబాద్‌లో రూ.887గా ఉన్న గ్యాస్ ధరలు 25రూపాయలు పెరిగి రూ.912కి చేరింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున గ్యాస్ సిలిండర్ల (LPG ధర) ధరను మారుస్తాయి. 2021 సంవత్సరం ప్రారంభంలో జనవరిలో, ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .694గా ఉండగా దశల వారీగా 165.50 పెరిగి 859.5కి చేరింది.