మొక్కలు నాటిన నూతన వధూవరులు…

197
green challenge

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో మొక్కలు నాటిన నూతన వధూవరులు అల్లూరి ప్రియాంక రెడ్డి మధురెడ్డి గారి పెండ్లి రోజున నవ దంపతులు మూడు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ తమ వంతుగా మూడు మొక్కలు నాటాలని తెలిపారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.