ఎంపీ సంతోష్ కృషి అభినందనీయం:అరవింద్ కుమార్‌

295
aravind kumar

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్‌. పారిశ్రామికవేత్త మై హోం రామేశ్వరరావు విసినిర ఛాలెంజ్‌ని స్వీకరించారు అరవింద్ కుమార్.

హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని రోడ్ నెంబర్ 1 లోని జలగం వెంగళ రావ్ పార్కులో మొక్కలను నాటారు. జువ్వి, మహాఘని ,రేలా మొక్కలను నాటిన అరవింద్ కుమార్‌…ఎంపీ సంతోష్ కుమార్‌ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని భగీరథ ప్రయత్నంలా కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రముఖులు కూడా స్పందించడం అభినందనీయం అన్నారు.