గోవాలో ఆకాశ్ పూరి…రొమాంటిక్‌

302
aakash puri

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జ‌రుగుతుంది. ర‌మ్య‌కృష్ణ స‌హా ఎంటైర్ యూనిట్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. 30 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, సాంగ్స్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫ‌స్ట్ లుక్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:ఆకాశ్ పూరి, కేతికాశ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ఉత్తేజ్‌, సునైన త‌దిత‌రులు,సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి,నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి,స‌మ‌ర్ప‌ణ‌: లావ‌ణ్య‌,సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌,సినిమాటోగ్ర‌ఫీ: న‌రేశ్,ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖి,ఆర్ట్‌: జానీ షేక్‌,పాట‌లు: భాస్క‌ర భ‌ట్ల‌,ఫైట్స్‌: రియ‌ల్ స‌తీశ్‌,పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌