ఏపీలో కొత్తగా 1,367 మందికి కరోనా పాజిటివ్..

28

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 61,178 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,367 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 288 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 217, కృష్ణా జిల్లాలో 155, ప్రకాశం జిల్లాలో 141, నెల్లూరు జిల్లాలో 135, పశ్చిమ గోదావరి జిల్లాలో 126 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,248 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,044కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,34,786 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,06,034 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 14,708 మందికి చికిత్స జరుగుతోంది.