తగ్గిన కరోనా శాంపిళ్ల టెస్టింగ్ ధరలు!

2124
ap coronatests

ఏపీలో కరోనా టెస్టులు చేయించుకునే వారికి గుడ్ న్యూస్ తెలిపింది ఏపీ ప్రభుత్వం. కరోనా టెస్టుల ధరలను మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరలను రూ. 800 నుంచి రూ. 475కు తగ్గించింది. అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లకు వెళ్లి చేయించుకునే కరోనా టెస్టింగ్ ధరలను రూ. 1000 నుంచి రూ. 499కు కుదించింది.

ఇక ఇవాళ ఏపీలో గత 24 గంటల్లో ఏపీలో 500 కొత్త కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,76,336 కు చేరింది. ఇందులో 8,64,612 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,660 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,064 మంది మృతి చెందారు.