సింగర్ సునీత రెండో పెళ్లి వాయిదా!

182
sunitha

సింగర్ సునీత నిశ్చితార్ధం ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ బిజినెస్ మెన్ రామ్‌తో సునీత నిశ్చితార్థం జరుగగా డిసెంబర్ 27న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరి వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది.

సింగ‌ర్‌గా, యాంక‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత. 19వ ఏటనే వివాహం చేసుకున్న సునీత తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది సునీత.