రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

160
ap corona
- Advertisement -

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి కొన్నిరోజులుగా ఊరట కలిగించే రీతిలో కరోనా తగ్గుముఖం పడుతోందన్న దానికి సూచనగా మరణాల సంఖ్య తగ్గుతుండడమే కాదు, కొత్త కేసుల సంఖ్య కూడా దిగి వస్తోంది. తాజాగా ఏపీలో కనిష్ట స్థాయిలో మరణాలు, పాజిటివ్ కేసులు వచ్చాయని తాజగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ రిలీజ్ చేసింది.

గడచిన 24 గంటల్లో ఏపీలో 5,487 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 37 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5745కి చేరింది. అదే సమయంలో 7,210 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్ గణాంకాలు చూస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,161కి చేరుకోగా, మరణాల సంఖ్య 5,745కి పెరిగింది. 6,12,300 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 63,116 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 310, చిత్తూరులో 329, తూర్పు గోదావరి జిల్లాలో 1010, గుంటూరులో 538, కడపలో 271, కర్నూలులో 113, కృష్ణా జిల్లాలో 97, నెల్లూరులో 489, ప్రకాశంలో 634, శ్రీకాకుళంలో 286, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 362, పశ్చిమ గోదావరిలో 903 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -