హీరోయిన్లు సంజన, రాగిణిలకు మరో షాక్‌..

177
Sanjana Galrani

డ్రగ్స్ వ్యవహారంలో కన్నడ హీరోయిన్లు సంజనా, రాగిణిలకు కోర్టు మరోసారి షాకిచ్చింది. డ్రగ్స్ కేసులో వీరిద్దరూ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అలానే ఈ కేసులో అరెస్టైన రాహుల్‌ బెయిల్‌ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. మరోవైపు కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకూ శాండిల్‌వుడ్‌ను కుదిపేసిన ఈ వ్యవహారం ఇప్పుడు కన్నడ టెలివిజన్‌ రంగాన్ని కూడా షేక్‌ చేస్తోంది.

కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, విచారించారు. సీసీబీ పోలీసుల విచారణలో కొత్తకొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సీసీబీ మరికొందరికి సమన్లు పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.