అనుష్క ప్రారంభించనున్న ఫిల్మ్ స్టూడియో..

18
Anushka

తెలుగు చిత్రపరిశ్రమలో మరో కొత్త సినీ స్టూడియో ప్రారంభంకానుంది. ప్రణతిరెడ్డి స్థాపించిన ఈ ఫిల్మ్ రిపబ్లిక్ స్టూడియో ద్వారా నేటితరం డిజిటల్ కంటెంట్ రూపొందించనున్నారు. ఈ స్టూడియోను టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రారంభించనుంది. దీనిపై ప్రణతి రెడ్డి స్పందిస్తూ, తమ ప్రొడక్షన్ సంస్థ ద్వారా వచ్చే కంటెంట్ గతంలో ఎన్నడూ చూడని కొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టుకు మీ ఆశీస్సులు కావాలంటూ ప్రేక్షకులను కోరారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.