BSNL నుండి సరికొత్త ఆఫర్..

204
bsnl
- Advertisement -

భారత టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. చందాదారుల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ఆ సంస్థ ఆకట్టుకునే ప్లాన్లు, ఒప్పందాలు, ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కొత్త వినియోగదారులకు ఉచితంగా సిమ్ కార్డు ఇస్తామని తెలిపింది. సాధారణంగా బీఎస్ఎన్‌ఎల్ ప్రతి కొత్త సిమ్ కార్డుకు రూ.20 వసూలు చేస్తుంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల మాదిరిగానే బీఎస్ఎన్‌ఎల్ కూడా సిమ్ కార్డుపై నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తుంది. కానీ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా కనీసం 100 రూపాయలతో ఫస్ట్ రీఛార్జ్ (FRC) చేసే కస్టమర్లకు సిమ్‌ను ఉచితంగా ఇస్తామని కంపెనీ తెలిపింది.

అయితే ఈ ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్ పరిమిత కాలానికే వర్తిస్తుంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ నవంబర్ 14 నుంచి నవంబర్ 28 వరకు మాత్రమే, అంటే 15 రోజుల వరకే అందుబాటులో ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు బీఎస్ఎన్‌ఎల్ నుంచి కొత్త సిమ్ కార్డు పొందటానికి రూ.20 చెల్లించాలి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయాల్లోనూ ఫ్రీ సిమ్ కార్డ్ ఆఫర్ను వినియోగదారులు పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్‌ఎల్ రిటైల్ స్టోర్‌లో వినియోగదారులు ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. సిమ్ కార్డుతో పాటు కనెక్షన్‌ను కూడా కస్టమర్లు పొందవచ్చు.

- Advertisement -