అనుష్క సాక్షిగా.. ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్..

263

‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’, ‘భాగమతి’ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసిన అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్ధం’ అనే చిత్రంలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో ఈ సంవత్సరాంతంలో భారీస్థాయిలో విడుదల కానుంది.

anuskha

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి అనుష్క ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. ఇందులో అనుష్క పెయింటింగ్ వేస్తున్న‌ట్టుగా ఉంది. టైటిల్‌కి సాక్షి.. మ్యూట్ ఆర్టిస్ట్ అనే క్యాప్ష‌న్ జ‌త చేశారు. అంటే అనుష్క సాక్షి పాత్ర‌లో మూగ‌మ్మయిగా కనిపించబోతున్నాట్లు సమాచారం. అనుష్క పెయింటింగ్ ద్వారానే మ‌న‌సులోని మాట‌ల‌ని చెబుతుందని ఈ లుక్‌ చూస్తే తెలుస్తోంది..

అనుష్క పాత్ర చిత్రణ మునుపెన్నడూ లేని విధంగా వైవిధ్యంగా ఉంటుంది అని నిర్మాతలు తెలిపారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా అనుష్క.. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో రుద్రమదేవి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.