‘ఊరంతా అనుకుంటున్నారు’ సెన్సార్ పూర్తి..

288

`నందిని నర్సింగ్ హోమ్` చిత్రంతో కథానాయకుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్బంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

Oorantha Anukuntunnaru

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాతలు‌ మాట్లాడుతూ.. “మా `ఊరంతా అనుకుంటున్నారు` చిత్రం సూప‌ర్‌స్టార్ కృష్ణ నటించిన ఒకప్పటి పండంటి కాపురం, ఊరికి మొనగాడు, మహేష్ బాబు మురారి, ఇటీవలి శతమానం భవతి చిత్రాలు, అప్పటి అష్టా చ‌మ్మా లాంటి పండ‌గ సినిమాల‌ను గుర్తు చేసే మ‌రో పండ‌గ చిత్ర‌మే మా `ఊరంతా అనుకుంటున్నారు`. కోనసీమ, చెన్నై, హైదరాబాద్ ల నేపథ్యాన్ని కెమెరామెన్ జి.ఎల్.ఎన్. బాబు అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో తెర‌పై ఆవిష్క‌రించారు. అలాగే కె.ఎం. రాధాకృష్ణన్ పాటలు, నేపథ్య సంగీతం చ‌క్క‌గా కుదిరాయి. సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ – శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

Oorantha Anukuntunnaru

న‌టీన‌టులు:నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర, అశోక్ కుమార్, ప్రభావతి, జబర్దస్త్ రామ్, జబర్దస్త్ బాబి, గౌతంరాజు, అప్పాజీ, క్రాంతి.