ప్రభాస్ కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు

297
Prabhas Fan

అభిమాన హీరో కోసం ఒక్కొక్కరు ఒక్కొ రకంగా తమ ప్రేమను చాటుకుంటారు. హీరోల పుట్టిన రోజు వేడుకలకు, మూవీ విడుదల సమయంలో తమకు తోచిన విధంగా అభిమనం చూపించుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి ప్రభాస్ కోసం సెట్ టవర్ ఎక్కాడు. వివరాల్లోకి వెళ్తె జనగామ జిల్లాలోని ఉడుముల హాస్పిటల్ పై ఉన్న సెల్ టవర్ ఎక్కాడు ప్రభాస్ అభిమాని. ఆ వ్యక్తి ప్రభాస్ వీరాభిమాని అంట.

అయితే ప్రభాస్ అక్కడికి వచ్చేంత వరకు అతను టవర్ దిగనని హల్ చల్ చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రభాస్ ఇక్కడకు రాకుంటే తాను టవర్ పై నుంచి దూకి చనిపోతానని బెదిరస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని ఆ వ్యక్తి కిందకు దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ వ్యక్తి మాత్రం కిందకి దిగేది లేదంటూ మారం చేస్తున్నాడు.