అనుపమ కొత్త అవతారం

65
- Advertisement -

అనుపమ పరమేశ్వరన్‌.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మలయాళం అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో కుర్రాళ్ల గుండెలు పిండేసింది. అందం, తనదైన నటనా, చలాకితనంతో మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగుతో పాటు కోలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉంది.

ఇక తాజాగా అనుపమ కొత్త అవతారం ఎత్తింది. సినిమాటోగ్రఫర్‌గా మారి ఓ ష్టార్ ఫిలీంను తెరకెక్కింది.సంకల్ప్ గోరా అనే ఓ యువకుడి దర్శకత్వంలో వచ్చిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌కి అనుపమ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చాయ్ బిస్కెట్ లో చూడొచ్చు. అమెరికాలో నివసిస్తున్న ఒక యువకుడు, అతని తల్లిదండ్రుల మధ్య ఉన్న ఎమోషనల్ బంధం, వాళ్ళు అతన్ని ఎలా మిస్ అవుతున్నారు అనే ఎమోషనల్ కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిలింని తెరకెక్కించారు.

ఇండియాలో జరిగిన షూటింగ్ పార్ట్ కి అనుపమ పరమేశ్వరన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసింది. అనుపమ కెమెరా పనితనం చూసిన వారంతా అభినందనలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -