ప్రేమించాను.. బ్రేకప్ అయింది – అనుపమ

37
Anupama Parameswaran

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమ కథా చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. వరుసగా ఆఫర్లను చేజిక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా అనుపమ ఎంతో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. తాజాగా తన జీవితంలో జరిగిన ఒక ఘటన గురించి ఆమె వెల్లడించింది. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.

రియల్‌ లైఫ్‌లో ప్రేమలో పడ్డారా? అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు అను షాకింగ్‌ సమాధానం ఇచ్చింది. గతంలో తాను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించానని అనుపమ సంచలన ప్రకటన చేసింది. అతన్ని ఎంతో ఇష్టపడ్డానని… అయితే, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యామని చెప్పింది. హీరో రామ్‌ గురించి?.. ప్రశ్నించగా.. సినీ హీరోల్లో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపింది.

ఇష్టమైన వంట?.. అమ్మ చేసే వంట అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. మీకు ప్రశాంతతను ఇచ్చే పని?.. పాటలు పాడటం తనకు ఇష్టమని… తనకు ప్రశాంతత కావాలనుకుంటే పెయింటింగ్స్ వేస్తానని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాలు?.. ప్రస్తుతం తెలుగులో ’18 పేజీలు’, ‘కార్తికేయ 2’, ‘రౌడీ బోయ్స్’ చిత్రాల్లో నటిస్తున్నానని… తమిళంలో ‘తల్లిపోగాదే’ సినిమాలో నటిస్తున్నానని అనుపమ తెలిపింది.